Homeతెలంగాణవిజయశాంతి రెడ్డి సూసైడ్ కేసు.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసు.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..

- Advertisement -

హైదరాబాద్ శివారులోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన తల్లీపిల్లల సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. డిప్రెషన్‌తోనే విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. కొన్నాళ్లుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ కేసుపై మరింత లోతుగా పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి నుంచీ పిల్లలు తల్లి మాట తూచా తప్పకుండా పాటించేవారని తెలుస్తోంది. పిల్లలపై ఉన్న ఆ కంట్రోల్‌తోనే విజయశాంతి రెడ్డి వారిని వెంట తీసుకెళ్లారు.తల్లి ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమైన పిల్లలు.. ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో రెండో ఫోన్ వాడారనే ప్రచారంలో నిజం లేదని పోలీసులు తెలిపారు. చనిపోవడానికి ముందు వారం రోజుల కాల్ డేటాపై విచారణ జరిపిన పోలీసులు.. ఎలాంటి అనుమానాస్పద అంశాలూ లభించలేదని తేల్చారు. కాగా.. జనవరి 30న రాత్రి చర్లపల్లి- ఘట్‌కేసర్ మధ్య రైల్వే ట్రాక్‌లపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయ శాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చేతన రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)లు గూడ్స్ రైలు కింద పడి మృతి చెందారు. ఘటనా స్థలంలో విజయశాంతి రెడ్డి కారులో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు జీవించాలని లేదని, పిల్లలను ఒంటరిగా వదలి వెళ్లలేను.. అంటూ రాశారు. ఈ కేసు విచారణలో భాగంగా విజయ ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ అనాలిసిస్‌కు పంపించారు. చివరకు డిప్రెషన్‌తోనే ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు