Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచట్టపరిధిలో గ్రామ ప్రజలు జీవించాలి.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు

చట్టపరిధిలో గ్రామ ప్రజలు జీవించాలి.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు

విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామ ప్రజలందరూ కూడా చట్టపరిధిలోనే జీవించితే సుఖవంతమైన జీవితము లభిస్తుందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు సిబ్బందితో కలిసి మండల పరిధిలోని నేలకోట తండాలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండాలని, పేకాటకు దూరంగా ఉండాలని, మధ్యానికి బానిస కాకూడదని తెలిపారు. సైబర్ క్రైమ్ పై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, అలా ఇస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. డైల్ 100, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గ్రామాలలో ఏ సమస్య వచ్చినా రూరల్ పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలలో మహిళా పోలీసులు ఉంటారని, వారికి కూడా సమాచారం ఇవ్వాలని తెలిపారు. గ్రామములో కొత్త వ్యక్తులు సంచరించిన యెడల మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలని వారు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు