-పల్లెల ప్రగతికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద పీట
ఎమ్మెల్యే : పత్సమట్ల ధర్మరాజు
విశాలాంధ్ర – నిడమర్రు (ఏలూరు జిల్లా) : పల్లెలే దేశానికి పట్టుపట్టుగొమ్మలని అటువంటి పల్లెల ప్రగతికి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. గురువారం నిడమర్రు మండలంలోని పలు గ్రామాల్లో ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నిడమర్రు గ్రామంలో ఎంజీఎన్ ఆర్ ఈజీఎస్ నిధులు 44 లక్షల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్లను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే శిలఫలాకన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో అంత విధ్వంసమే కనిపించందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్లె ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా నాడు శ్రీకారం చుట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు కార్య రూపం దాల్చటంతో ప్రజలంతా ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎన్ నాగరాజు, ఎంపీడీవో విజయ కుమారి, మండల అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.