Wednesday, February 18, 2026
Homeక్రీడలువిరాట్‌ ఇన్‌స్టా ఖాతా అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం

విరాట్‌ ఇన్‌స్టా ఖాతా అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం

- Advertisement -

టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి (virat kohli) సోషల్‌ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు అనుసరిస్తుంటారు. ఇన్‌స్టాలో అతడి వెరిఫైడ్‌ అకౌంట్‌కు 270 మిలియన్లకు పైగా యూజర్లున్నారు. అతడు ఏ పోస్ట్‌ పెట్టినా క్షణాల్లోనే లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తుంది. విరాట్‌ ఇన్‌స్టాలో ఎక్కువగా బ్రాండ్‌ ప్రమోషన్లు, క్రికెట్‌ అప్‌డేట్స్‌, వ్యక్తిగత సమాచారం పంచుకుంటుంటాడు. అయితే శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి అతడి ఇన్‌స్టా ఖాతా స్తంభించిపోయింది. ‘ప్రొఫైల్‌ ఈజ్‌నాట్‌ అవెయిలబుల్‌్ణ అనే మెసేజ్‌ కనిపించింది. అతడు గతంలో పెట్టిన పోస్టులేమీ కనిపించలేదు. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఉన్నట్లుండి తమ స్టార్‌ బ్యాటర్‌ ఇన్‌స్టా అకౌంట్‌కు ఏమైందని కంగారు పడ్డారు. అదే సమయంలో విరాట్‌ కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్‌ కూడా స్తంభించిపోయింది. ఆ అకౌంట్‌ను యూజర్లు యాక్సెస్‌ చేయాలని ప్రయత్నిస్తే.. ‘ప్రొఫైల్‌ ఈజ్‌నాట్‌ అవెయిలబుల్‌్ణ అని మెసేజ్‌ వచ్చింది. దీంతో అభిమానులు అనుష్కశర్మ ఎక్స్‌ ఖాతాలో పోస్టుల కింద.. విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్‌కు ఏమైందంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే కొన్ని గంటల తర్వాత విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్‌ యాక్టివేట్‌ అవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోహ్లీ ఇన్‌స్టా ఖాతా ఇలా ఎందుకు స్తంభించిపోయిందో తెలియలేదు. ఈ విషయమై ఇప్పటివరకు మెటా కానీ, కోహ్లీ టీమ్‌ కానీ స్పందించలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు