Thursday, January 9, 2025
Homeజిల్లాలువిజయనగరంతెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ విశాలాంధ్ర బుక్ హౌస్

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ విశాలాంధ్ర బుక్ హౌస్

ఒకటో పట్టణ సిఐ ఎస్ శ్రీనివాస్

విశాలాంధ్ర విజయనగరం టౌన్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ విశాలాంధ్ర అని ఒకటో పట్టణ సీఐ ఎస్ శ్రీనివాస్ అన్నారు బుధవారం స్థానిక కోట జంక్షన్ వద్ద విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో విశాలాంధ్ర సంచార గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాలాంధ్ర బుక్ హౌస్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. పుస్తక పఠనం తనకు అలవాటని, పుస్తక పఠనం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవచ్చని తెలియజేశారు. ముఖ్యంగా నేటి యువత పుస్తకాలకి దూరమై సోషల్ మీడియా కి దగ్గరయ్యారన్నారు. యువత పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలని, సోషల్ మీడియాలో విజ్ఞానం కంటే యువతని అఙ్ఞానం వైపు, అశ్లీలం వైపు నడిపిస్తుందన్నారు. యువతరం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ సంచార గ్రంథాలయాన్ని జిల్లా వ్యాప్తంగా నడపడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరికి విశాలాంధ్ర పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మండలాల్లో సైతం ఈ సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు ఈ సంచార గ్రంథాలయాల పుస్తకాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు కార్యక్రమంలో విశాలాంధ్ర విజయనగరం స్టాఫ్ రిపోర్టర్ ఎన్ సన్యాసిరావు,విజయనగరం టౌన్ ఇన్చార్జి మరుపల్లి ప్రతాప్ కుమార్, సర్కులేషన్ ఇన్చార్జి గిరిధర్ సింగ్, విశాలాంధ్ర బుక్ హౌస్ ఉద్యోగి వేణు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు