విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : విశాలాంధ్ర దినపత్రికలో గత కొద్ది రోజుల క్రితం అధికారులు హెచ్చరిస్తున్న పట్టించుకోని ఇసుక రవాణా దారులు అని ప్రచురించిన కథనానికి రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.అశోక్ కుమార్ తన సిబ్బందితో రాజాం పట్టణ పరిధి బొబ్బిలి జంక్షన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక లోడుతో తార్పాను కప్పకుండా వెళుతున్న ట్రాక్టర్ను పట్టుకొని పెనాల్టీ విధించారు, ఇకపై తార్పాన్ లు కప్పకుండా రవాణా చేసినట్లయితే టాక్టర్ ను సీజ్ చేస్తామని, డ్రైవర్ కు హెచ్చరించారు. ఇకపై ఇసుక రవాణా దారులు ఏ ట్రాక్టర్ పైన అయినా, ఎవరైనా తార్పానులు కప్పకుండా ఇసుక రవాణా చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ కె.అశోక్ కుమార్ తెలిపారు. ఎస్సై వై. రవి కిరణ్, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.