Saturday, March 7, 2026
Homeజిల్లాలుఏలూరువిశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -

విశాలాంధ్ర – ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆళ్వార్ సత్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుదవారం ఘనంగా నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని విశ్వకర్మ భగవానుడిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు మండల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. అలాగే మండలంలోని గుండుగొలనుకుంటలో ఓ డ్వాక్రా సంఘ సభ్యురాలుకి ప్రభుత్వం మంజూరు చేసిన ఎగ్ కార్ట్ యూనిట్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, మొగతడకల శ్రీనివాసరావు, ఏపూరి దాలయ్య, మొగతడకల ఓం ప్రకాష్ చౌదరి, మద్రాసు రాము, పాకనాటి శేషుబాబు, పాకలపాటి గాంధీ, మట్టపర్తి రూపేష్, కోట అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు