Friday, April 25, 2025
Homeఅంతర్జాతీయంఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం

ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం

అమెరికా, చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం
అమెరికా ఏకపక్షంగా సుంకాలను విధిస్తోందన్న చైనా

అగ్రరాజ్యాలు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం ఇరు దేశాల మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికైంది. అమెరికా విధిస్తున్న సుంకాలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని చైనా తీవ్రంగా విమర్శించగా, చైనా వాదనల్లో విశ్వసనీయత లేదని అమెరికా గట్టిగా బదులిచ్చింది. నిన్న జరిగిన భద్రతామండలి సమావేశంలో చైనా రాయబారి ఫు కాంగ్ మాట్లాడుతూ, అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధిస్తూ ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విధానాలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. తమపై ఒత్తిడి పెంచేందుకు భారీ సుంకాలు విధించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై అమెరికా మిషన్‌ ప్రతినిధి టింగ్ వు తీవ్రంగా స్పందించారు. చైనా వ్యాఖ్యలను ప్రపంచం పట్టించుకోవద్దని, ఆ దేశం అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య పద్ధతులను గమనించాలని సూచించారు. చైనా వాదనల్లో నిజాయతీ లేదని ఆయన విమర్శించారు. కాగా, ట్రంప్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై 145 శాతం సుంకాలు విధించగా, ప్రతిగా అమెరికా వస్తువులపై చైనా 125 శాతం టారిఫ్‌లను అమలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు