Homeఅంతర్జాతీయంఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం

- Advertisement -

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు రూ.31 వేల కోట్ల విలువైన ఆయుధ నష్టం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా భారీగా సైనిక ఆయుధ నష్టాన్ని చవిచూసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా సైన్యానికి చెందిన 81 సైనిక విమానాలు దెబ్బతిన్నట్లు లేదా ధ్వంసమైనట్లు సమాచారం.ఈ నష్టం విలువ దాదాపు రూ.31 వేల కోట్లుగా ఉంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి.ఈ నష్టాల్లో అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.F-35A లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్‌తో పాటు 12 F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.ఒక్కో విమానం విలువ సుమారు రూ.289 కోట్లు ఉండే నాలుగు F-15 జెట్‌లు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.

MQ-9 రీపర్ డ్రోన్లకు భారీ నష్టం
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల్లో మరో ఎనిమిది F-15E జెట్‌లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.అయితే వాటికి మరమ్మతులు పూర్తిచేసి తిరిగి సైనిక సేవల్లోకి తీసుకొచ్చినట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్లకు కూడా భారీ నష్టం వాటిల్లింది.ఒక్కో డ్రోన్ విలువ 30 నుంచి 50 మిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది.ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇప్పటివరకు 45 MQ-9 రీపర్ డ్రోన్లు ధ్వంసమైనట్లు సమాచారం.నిఘా కార్యకలాపాలతో పాటు క్షిపణి దాడులకు కీలకంగా ఉపయోగించే ఈ డ్రోన్లు ప్రస్తుతం అమెరికా వద్ద 135 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

F-35A విమానం, E-3 సెంటినల్ నిఘా విమానాన్ని కోల్పోయిన అమెరికా
గతంలో అమెరికా వైమానిక దళం వద్ద ఏ సమయంలోనైనా కనీసం 189 MQ-9 రీపర్ డ్రోన్లు ఉండేవి.దీంతో ప్రస్తుత నష్టాల ప్రభావం అమెరికా డ్రోన్ సామర్థ్యంపై పడినట్లు తెలుస్తోంది.ఇరాన్‌పై జరిగిన దాడుల్లో అమెరికా తన అధునాతన సైనిక విమానాల్లో ఒకటైన ఐదోతరం F-35A విమానంతో పాటు E-3 సెంటినల్ నిఘా విమానాన్ని కూడా కోల్పోయినట్లు సమాచారం.అయితే అమెరికా సైనిక విమానాలు, డ్రోన్లకు జరిగిన మొత్తం నష్టంపై అధికారికంగా పూర్తి గణాంకాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.

అమెరికా కోల్పోయిన కీలక ఫైటర్‌ జెట్లు..
ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు-12

ఎఫ్-35ఏ లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం-1

ఏ-10 వార్‌థాగ్ దాడి విమానాలు-2

కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ గగనతల ఇంధన సరఫరా విమానాలు-7

ఈ-3 సెంట్రీ గూఢచార విమానం-1

ఎంసీ-130జే కమాండో II ప్రత్యేక కార్యకలాపాల విమానాలు-2

హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II యుద్ధ శోధన-రక్షణ హెలికాప్టర్-1

ఎంక్యూ-4సీ ట్రైటాన్ అధిక ఎత్తులో ఎక్కువసేపు ఎగిరే డ్రోన్-1

ఎంక్యూ-1 బహుళ ప్రయోజన డ్రోన్‌లు-3

ఏహెచ్-64 అపాచీ దాడి హెలికాప్టర్-1

ఏహెచ్-6 లిటిల్ బర్డ్ తేలికపాటి దాడి హెలికాప్టర్లు-4

ఎంహెచ్-60 సీ హాక్ సముద్ర హెలికాప్టర్-1

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు