కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన సిపిఐ నాయకులు
విశాలాంధ్ర ముదిగుబ్బ:: పంపు హౌస్ కార్మికులుతమకు రావలసిన పది నెలల జీతాలు వెంటనే చెల్లించాలని గత వారం రోజులుగా విధులు బహిష్కరించి ముదిగుబ్బ లోని పంపు హౌస్ వద్ద సమ్మె చేస్తున్న గ్రామీణ నీటి సరఫరా కార్మికులకు బుధవారం సిపిఐ నాయకులు మద్దతు పలికారు.ఈ మేరకు ఆ పార్టీ మండల కార్యదర్శి చల్ల శ్రీనివాసులు, లింగుట్ల వెంకటరాముడు తదితరులు కార్మికులతో కలిసి పంపు హౌస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన త్రాగునీటి సరఫరా కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు, ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు సుమారు పది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నడుమ తమ కుటుంబాలను పోషించుకునే స్థోమత లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, ఈ పరిస్థితుల్లో వారు అధికారులను జీతాలు ఇవ్వాలని తరచూ అభ్యర్థిస్తున్న ప్రయోజనం లేకుండా పోవడంతో గత్యంతరం లేక వారు సమ్మెకు దిగాల్సిన దుస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు, గత ఐదారేళ్ల నుంచి నేటి వరకు కార్మికులు తమ జీతాలు కోసం తరచూ సమ్మెలు చేయడం, రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితి దాపురిస్తోందని తెలిపారు, కనుక ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు రావలసిన పది నెలల వేతనాలు సత్యసాయి కార్మికులు కావాల్సిన 4 నెలల జీతాలు వెంటనే చెల్లించి , కార్మికులు సమ్మెను విరమింప చేసి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో అతి త్వరలోనే కార్మికుల తో పాటు వారి కుటుంబాలతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టి జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాసులు అధికారులను హెచ్చరించారు.
నీటి సరఫరా కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలి
RELATED ARTICLES