Friday, December 20, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు సేవ చేయడం మా అదృష్టం..

రోగులకు సేవ చేయడం మా అదృష్టం..

శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడమే మా అదృష్టము అని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని 380 మంది రోగులకు, వారి సహాయకులకు భోజనపు ప్యాకెట్లను వైద్యులు, నర్సుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతగా శ్రీవారి రామ్మోహన్రావు రిటైర్డ్ రేడియోలజిస్ట్ సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. వారికి మా సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఈ సేవలు ఎవరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. రోగులకు ఇటువంటి సేవా కార్యక్రమం వరం లాగా మారిందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి తరపున డాక్టర్ మాధవి సేవాసమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తిగల దాతలు సెల్ నెంబర్ 9966047044 గాని 903044065కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు