Thursday, January 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిశాలాంధ్ర వార్తకు స్పందన

విశాలాంధ్ర వార్తకు స్పందన

అవాస్తవాలను ప్రచారం చేసి ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడాన్ని ఖండిస్తున్నాం

విశాలాంధ్ర,కదిరి.(శ్రీ సత్య సాయి జిల్లా)ఏ బి సి డబ్ల్యు బాలాజీ ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నిన్నటి దినం వచ్చిన వార్తకు ఏ బి సి డబ్ల్యు బాలాజీ స్పందించారు.ఆయన మాట్లాడుతూ కదిరి డివిజన్ పరిధిలోని బీసీ హాస్టల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని, డిమాండ్ చేశారు.జిల్లాలో ఎక్కడా లేని విధంగా కదిరి డివిజన్ హాస్టల్లో ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం వడ్డీంచకుండా కాసులకు కక్కుర్తిపడి నాసిరకమైన భోజనం పెడుతూ విద్యార్థుల కడుపు కొడుతున్నారని, విచారణ పేరుతో వార్డెన్లతో నెలనెలా మామూలు పేరుతో వసూలు చేస్తున్నాడని, వార్డెన్లను,వర్కర్లను కులం పేరుతో దూషిస్తూన్నారన్నానే వి వాస్తవాలు కాదన్నారు. ప్రతిరోజు ఎఫ్ ఆర్ ఎస్ ద్వారా హాజరు వేయించి మెనూ ప్రకారం భోజనాలు వడ్డిస్తున్నామని ఇందులో అవినీతికి ఆస్కారం లేదన్నారు. అనంతరం వార్డెన్ లో మాట్లాడుతూ నాలుగు నెలలకు ఒకసారి డైట్ బిల్లు మంజూరు అవుతున్నాయని అంతవరకు అప్పులు చేసి వసతి గృహాలు నిర్వహిస్తున్నామని అవాస్తవాలను ప్రచారం చేసి ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు జయరాం రెడ్డి,ఆంజనేయులు, సాంబశివ,లీలావతి సరస్వతి,షబానా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు