రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం మా అదృష్టంగా భావిస్తున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరము రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ -శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చింతలూరు సత్య నారాయణ భార్య కీర్తిశేషులు చిందలూరు పద్మావతమ్మల జ్ఞాపకార్థం కుమారులు కోడళ్ళు (సత్య కృపా సిల్క్స్-ధర్మవరం) నిర్వహించడం పట్ల రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలను తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. ప్రతి శిబిరము దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని, వేలాదిమంది పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం మా ధ్యేయము అని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు శిబిరానికి వచ్చిన వారందరికీ కంటి వైద్యులు డాక్టర్ హేమంత్ పరీక్షలు నిర్వహించారని, ఇందులో 96 మంది రోగులు రాగా 73 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం డాక్టర్ తో పాటు క్లబ్బు కమిటీ వారు కూడా కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు వివరించారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత వసతి, ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత ఆపరేషన్, ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీర్ క్లబ్ ఐఎస్ఓ రాజేశ్వరి, నరేందర్ రెడ్డి, బండారు చలం, కొండయ్య, సత్రశాల ప్రసన్నకుమార్, శివయ్య, గట్టు హరినాథ్, బి. శ్రీనివాసులు, పెరుమాళ్ళ దాస్, జయచంద్ర, మనోహర్ గుప్తా, బత్తలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం మా అదృష్టంగా భావిస్తాం..
RELATED ARTICLES