Saturday, May 10, 2025
Homeఅంతర్జాతీయంభారత సైన్యం వారి చర్యలను అంతే సమర్థవంతంగా తిప్పికొడుతోంది

భారత సైన్యం వారి చర్యలను అంతే సమర్థవంతంగా తిప్పికొడుతోంది

పాక్ లోని ఆ నాలుగు ఎయిర్ బేస్ ల‌ను లేపేశాం..క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి

పాకిస్తాన్ తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో రెచ్చగొట్టే దాడులకు తెగబడుతోంది. శుక్ర‌వారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించింది పాక్‌. ముఖ్యంగా శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ విమానాలు చొచ్చుకురావడానికి ప్రయత్నించాయని భారత సైన్యం వెల్లడించింది. ఈ మేరకు కల్నల్ సోఫియా ఖురేషి తాజాగా వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో దాడులు చేస్తోందని ఆమె తెలిపారు. అయితే భారత సైన్యం వారి చర్యలను అంతే సమర్థవంతంగా తిప్పికొడుతోందని తెలిపారు.పాకిస్తాన్ నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందరి ఆమె వెల్లడించారు. శుక్ర‌వారం రాత్రి వారు ఏకంగా 24 చోట్ల మన వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించారని, శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వంటి కీలకమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. కానీ భారత సైన్యం వారికి గట్టి జవాబు ఇస్తోందని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. పాకిస్తాన్‌లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని తెలిపారు. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురిద్, షోర్కోట్‌లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడి చేశామ‌న్నారు.., అవి పూర్తిగా ధ్వంస‌మ‌య్యాని తెలిపారు., భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందన్నారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నామని తెలిపారు. కాగా -400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసిందని సోఫియా ఖురేషి పేర్కొన్నారు.

పాకిస్తాన్ ఈ వరుస దాడులు ప్రాంతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయ‌న్నారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉంటూ శత్రువుల ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేస్తోంద‌ని చెప్పారు. పాకిస్తాన్ ఈ దుస్సాహసాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆమె హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు