విశాలాంధ్ర – జెఎన్టియు ఏ : కంపెనీల పోటీ తత్వానికి దీటుగా ఎదుర్కొని ఉద్యోగ నియామకాలను అందిపుచ్చుకోవాలని జేఎన్టీయూ ఏ ఇంజనీరింగ్ కళాశాల (అనంతపురం) ప్రిన్సిపల్ ఆచార్య పి చెన్నారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంటెక్ ,ఎంసీఏ విద్యార్థులకు రీజనింగ్, ఆప్టిట్యూడ్ పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పాఠ్యాంశాల అంశాలతో పాటు పరిశోధన అన్వేషణ, అధ్యయనం, ఆలోచనలు అమలు, విభిన్న రంగాలలో తమదైన ప్రతిభను చాటాలున్నారు. కోర్సుతో పాటు పోటీ పరీక్షలపై నిరంతర కృషి, సన్నద్ధత, స్నేహితుల సమస్య ఐక్యతతో విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాంగణ నియామకాల అధికారి డాక్టర్ జే. శ్రీనివాసులు , అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.