డి.ఎస్.పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; రౌడీ షీటర్లు అందరూ కూడా చట్టపరంగా జీవించాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవు అని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి హేమంత్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, గ్రామాల్లో గొడవలకు దూరంగా ఉండాలని, చట్టపరంగా కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని జీవనమును కొనసాగించాలని తెలిపారు. అలా గాకుండా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
చట్టపరంగా జీవించాలి.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు..
RELATED ARTICLES