చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్
విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : పేదలందరికీ అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సు స్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ దేశానికి అందించారని వజ్రకరూరు మండలం చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ 134 వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గ్రామ సచివాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో ఎన్నో సంస్కృతులు, భాషలు, ఆచారాలు, కులాలు, మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ వారందరినీ ఒక్కతాటిపై నిలిచేవిధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడంతో పాటు పేదల కు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం వారికి అభి వృద్ధిలో ముందుకు సాగడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఎన్నో సవాళ్లను అదిగమించి ఎన్నో దేశాలకు మన దే శం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మన దేశం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మంచి స్థితిలో ముందుకు వెళ్తుందన్నారు. అందరు సమానంగా ఎదగడానికి శోధించి, సమీకరించి, పోరాడి రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఉధ్యమించిన గొప్ప వ్యక్తి అని ఆయనను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సి. ఎర్రి స్వామి, శ్రీనివాసులు, లింగమూర్తి, చంద్రశేఖర్, నరసింహులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.