అనంతపురం ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం డివిజన్ పరిధిలో ప్రతి గ్రామాన్ని సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి అని అనంతపురం ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను వారి పరిశీలించారు. నిరంతరం నాటు సారా పై దాడులు నిర్వహిస్తూ బైండోవర్లు పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా నవోదయమును విజయవంతం చేయాలని కూడా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సిఐ చంద్రమణి, ఎస్సై చాంద్ బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.