Thursday, January 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసమన్వయంతో, సానుకూల దృక్పథముతో ముందుకు వెళ్లాలి.. ఎంపీడీవో సాయి మనోహర్

సమన్వయంతో, సానుకూల దృక్పథముతో ముందుకు వెళ్లాలి.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో సానుకూల దృక్పథముతో ముందుకు వెళ్లినప్పుడే విజయం చేకూరుతుందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో 11 అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన ధర్మవరం-మనందరి ధర్మవరం థీమ్ తో అందరూ నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా ఎండాకాలంలో నీటి కొరత ఉండకుండా ప్రతి ఒక్కరూ ప్రజల చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని తెలిపారు. తాగునీటి ఎద్దడి వాటి నివారణ పై చర్చలు, అడవులకు నిప్పు, దొంగతనములు వాటి నివారణ, తదితర విషయాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు అభివృద్ధి రూపు కల్పనకు సభ్యులు సలహా సూచనలు కూడా చేయడం జరిగిందన్నారు. వాటిని తప్పక అమలులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సమస్యను అన్ని విభాగాలలో చర్చించి పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మోడల్ మండలముగా ధర్మవరమును తీర్చిదిద్దుకోవాలని, అది కేవలం టీం తోనే సాధ్యపడుతుందని తెలిపారు. మన కార్యాలయంలో రాజ్యాంగ శీర్షికని కూడా ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. తదుపరి రూరల్ ఎస్సై శ్రీనివాసులు బాల్య వివాహాలు, చట్టపరంగా నడుచుకోవాల్సిన అంశాలను కూడా పూర్తిగా వివరించారు. అనంతరం మన మండలంలో జీవన ధార అనే కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ద్వారా వేసవికాలంలో నీటి సమస్య లేకుండా చూసుకోవడం, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు తర్వాత సెల్ఫోన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రతాపరెడ్డి, ఎంపీపీ రమాదేవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, డాక్టర్ పుష్పలత, సర్పంచులు,ఎంపీడీవో కార్యాలయ అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు