Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహస్త కళల అభివృద్ధికి పాటుపడాలి..

హస్త కళల అభివృద్ధికి పాటుపడాలి..

- Advertisement -

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; హస్త కళల అభివృద్ధికి పాటుపడాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కలల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ధర్మవరం విచ్చేసిన సందర్భంగా వారిని చిలక మధుసూదన్ రెడ్డి తేనేటి విందుకు ఆహ్వానించి, తదుపరి దృశ్యాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు వారు తెలియజేశారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పసుపులేటి హరిప్రసాద్ అనుభవము, మార్గదర్శనము కలవారని రాష్ట్రంలోని హస్తకళలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, హస్త కళాకారుల అభ్యున్నతికి వారి యొక్క కృషి అందరిచే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తదుపరి వారు రాజకీయంగా మరింత శ్రేయస్సు సాధించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు