-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ
విశాలాంధ్ర-రాప్తాడు (అంతపురం జిల్లా) : తనకున్న పొలంలో
ఆరుగాలం కష్టపడుతూ తన కుటుంబంతోపాటు సేద్యం కోసం వృషభాలను
పోషించుకుంటున్న రాప్తాడు కు చెందిన దండు శివయ్య గడ్డివాములు దురదృష్టవశాత్తు అగ్నికి ఆహుతవడం బాధాకరమని టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు గురువారం ధర్మవరపు మురళీ రాప్తాడుకు వచ్చి దండు శివయ్య, మంజుల దంపతులకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా సాకే జయరాముడు రూ. 3000 వేలు అందజేశారు. రూ.3లక్షల విలువ చేసే గడ్డి కాలిపోయిందని ఆదుకోవాలని రైతు శివయ్య కోరగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ జరిగిన నష్టానికి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం త్వరితగతిన మంజూరయ్యేలా చొరవ తీసుకుంటామని మురళీ భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనా, జూటూరు రామకృష్ణ, సర్పంచ్ సాకే తిరుపాలు, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, మూలింటి బీరన్న, గోనిపట్ల శీనా, హంపాపురం జయప్ప, గంజి రాముడు, సీసీ రాము, పాలచెర్ల ముత్యాలు, దండు మురళీ, రామనేపల్లి రాము, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి శివ, డీలర్లు దండు నరేంద్ర, సూరీ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.