విశాలాంధ్ర – ఆదోని : ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు గ్యాస్ సిలిండర్ పేలి నష్టపోయిన రెండు కుటుంబాలకు బుధవారం ఒక్క కుటుంబానికి 5000 చొప్పున రెండు కుటుంబాలకు 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మారుతిరావు, టిడిపి టౌన్ సెక్రెటరీ సాకర ఈరన్న, తిమ్మప్ప, వార్డు ఇంచార్జ్ మాజీ కౌన్సిలర్ సాకరే లక్ష్మణ్, దత్త రఘునాథ్, పొందే రాజ్ కుమార్, అశోక్, జాల్గార గిరి రవి, తెలుగుదేశం పార్టీ నాయకులు రంగస్వామి నాయుడు, బసాపురం రామస్వామి, రంగన్న, అప్సర్ భాష, మా భాష, సుబ్బు,జగదీష్, గిడ్డయ్య, శివ, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.