వెనెజువెలాపై మెరుపుదాడి చేసి ఆ దేశ నేత నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అగ్రరాజ్యం ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు కథనాలు వచ్చాయి. ఈ అంశంపై ట్రంప్ తాజాగా స్పందించారు. సీక్రెట్ సోనిక్ వెపన్ ను వినియోగించినట్లు ధ్రువీకరించారు. తమవద్దే ఈ తరహా శక్తిమంతమైన ఆయుధం ఉందని.. మరే దేశం వద్ద ఇలాంటి సాంకేతికత లేదని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.‘మన దగ్గర ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని భావిస్తున్నాను. అదొక అద్భుతమైన దాడి అని ట్రంప్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. మదురోను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో యూఎస్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిందని ఇటీవల ఆ మాజీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ చెప్పిన వివరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాయి.‘‘మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయాం. అగ్రరాజ్యం తో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది అని ఆందోళన వ్యక్తంచేశాడు. ఓ మీడియా సంస్థ ప్రచురించిన ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో ఈ ఆయుధం వార్తలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
వెనెజులాపై ‘రహస్య ఆయుధం వాడాం: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


