Monday, April 21, 2025
Homeజిల్లాలుఅనంతపురండీఎస్సీ నోటిఫికేషన్ విడుదలను స్వాగతిస్తున్నాం

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలను స్వాగతిస్తున్నాం

ఎఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్

విశాలాంధ్ర- అనంతపురం : ఏ ఐ వై ఎఫ్ పోరాటాల ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలను స్వాగతిస్తున్నామని ఎఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఐ వై ఎఫ్ ఆద్వర్యంలో నిరుద్యోగులును ఐక్యం చేసి అనేక పోరాటాలు చేయడం ద్వారానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సాధ్యం అయిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా సమితి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ డీఎస్సీ అభ్యర్థులకు చెప్పుకోవచ్చు కానీ కొన్ని జిల్లాలకు తక్కువ పోస్టులు ఉన్నాయన్నారు. అందులో డీఎస్సీ ఎస్జీటీ పోస్టులు తక్కువ ఉన్న జిల్లాలు శ్రీకాకుళం జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అనంతపురం జిల్లా పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది డిఎస్సి అభ్యర్థులకు చాలా బాధాకరమైన విషయం అన్నారు. రాష్ట్రంలో 29 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పోస్టులు పెంచేలా పునరా ఆలోచన చేయాలన్నారు . జిల్లాకు ఓకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి భవిష్యత్తులో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. గత,“ 7”సంవత్సరాలలో నోటిఫికేషన్ విడుదల కాలేదని అభ్యర్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు పై రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచించాలని కోరారు. పీఈటీ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. పరీక్ష గడువు తక్కువగా ఉందని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారని కనీసం 70-90రోజులు అయినా పెంచాలని కోరారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రేష్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు దేవ, సహాయక కార్యదర్శి ధనుంజయ్, ఉరవకొండ మండల కార్యదర్శి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు