అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : సబ్ జైలు లోని ఖైదీలందరికీ కూడా తమ సమస్యల పరిష్కారం కొరకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సబ్ జైలును వారు ఆకస్మికంగా తనకి నిర్వహించారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడి వారు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బ్యారెకులు, వంటగది, ఖైదీల గదులు, కార్యాలయ గదులను వారు పరిశీలించారు. అనంతరం ఖైదీల రిజిస్టర్‌ను వారు తనిఖీ చేశారు. ఖైదీలుగా మీరు సబ్ జైలులో మంచి ప్రవర్తనగా ఉండాలని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి వ్యక్తిగా మెలగాలని వారు సూచించారు. నాణ్యమైన భోజనాన్ని ఖైదీలకు వడ్డించాలని, అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండే విధంగా చర్యలు గైకొనాలని సబ్జెక్టు బ్రహ్మారెడ్డికి సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగి సబ్‌జైల్ అధికారి వద్ద మంచి గుర్తింపు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాలసుందరి, బిల్లే రవీంద్ర, ప్యారా లీగల్ వాలంటీ ర్ షామీర్ భాష, సబ్ జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
ఖైదీల సమస్యలకు ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం..
RELATED ARTICLES