– ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు …
– తక్షణమే వెంకన్నపాలెం పెద్ద మదం పై రక్షణ గోడ తక్షణమే నిర్మించాలి ……
– సిపిఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : వెంకన్నపాలెం ఇరుకుమదంపై రక్షణ గోడలు నిర్మించకపోతే ఆర్ అండ్ బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు మాని మండలంలోని వెంకన్నపాలెం సమీపంలో బి.ఎన్. రోడ్డుపై ఇరుకు మదుం పై రక్షణ గోడ తక్షణమే నిర్మించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మంగళవారం డిమాండ్ చేశారు. అనకాపల్లి – చోడవరం ప్రధాన రహదారిలో గుంతల రోడ్లు వెంకన్నపాలెం సమీపంలో కాలవపైన గల ఇరుకు మధుంపై రక్షణ గోడ నిర్మించకుండా కాలయాపన చేస్తున్న ఆర్ అండ్ బి అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్నారు. ప్రధాన రహదారిలో ఇరుకు మధుము పై సేఫ్టీ వాల్ కూలిపోయిన ను ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోక పోవడంతో
నిరంతరం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు గాని, నిర్మాణ చర్యలు కాని చేపట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
గతంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి విషయాన్ని తెలియజేస్తే, తూతూ మంత్రం గా ఇసుక మూటలు, నాలుగు జండాలు పెట్టి చేతులు దులుపుకున్నారు అని తెలిపారు. వెంకన్నపాలెం గోవింద మాస్టారు చాలా సందర్భాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రయాణకులకు తెలియజేసే పద్ధతుల్లో జండాలు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. గుంతల రోడ్లు, ప్రజా సమస్యలు పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే నిద్ర మత్తు విడనాడాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు నిరంతరం ప్రయాణిస్తున్న గుంతల రహదారి, ప్రమాద కల్వర్టులను కనీసం పట్టించుకునే పరిస్థితి, లేకపోయిందని ఎద్దేవా చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మంగళవారం ప్రమాద రహదారులు, వెంకన్నపాలెం ఇరుకు మదం వద్ద సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలతో ఆందోళన నిర్వహించారు.