జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, పి4 మోడల్ సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే, జిల్లా వారీగా పెర్కోప్షన్ ట్రాకింగ్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పి4 మోడల్ సర్వే సకాలంలో ప్రతిష్టాత్మకంగా చేపడతామని వివరించారు. ఈనెల 20వ తేదీ నుంచి మొదటి దశలో జిల్లాలో పి4 మోడల్ సర్వే మొదలుపెట్టడం జరిగిందన్నారు. పి4 మోడల్ సర్వేపై బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ అందించామన్నారు. ఈ సర్వేలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను భాగస్వామ్యం చేశామన్నారు. సకాలంలో ఈ సర్వే చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, సర్వేపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 23వ తేదీన ఆదివారం నిర్వహించే ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలకు జాయింట్ కలెక్టర్ ఓవరాల్ ఇంచార్జిగా ఉంటారన్నారు. పరీక్షల కోసం అవసరమైన స్టేషనరీని చెక్ లిస్ట్ ప్రకారం సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించే 14 వెన్యూ కేంద్రాలలో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ అన్ని వెన్యూ కేంద్రాలను తనిఖీ చేయాలని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు డిఆర్ఓ ఇంచార్జిగా ఉంటారన్నారు. పరీక్షల ప్రశ్నాపత్రం మూమెంట్ ను పోలీసులు తనిఖీలు చేయాలన్నారు. పరీక్షల కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సిసిటివి కెమెరాలు అన్ని కేంద్రాలలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, డిఈఓ ప్రసాద్ బాబు, డివిఈఓ వెంకటరమణ నాయక్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, డిపిఓ నాగరాజు నాయుడు, సిపిఓ అశోక్ కుమార్, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, జడ్పి సిఈఓ రామచంద్రారెడ్డి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ ఎస్.ఎన్. షరీఫ్, ఎస్ఓలు శంకర్ రావు, ఆరోగ్య రాణి, నాగభవాని, ఎన్ఐసి డిఐఓ రవిశంకర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి కల్యాణి, ఆర్కియాలజి ఎడి రజిత, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో పి4 మోడల్ సర్వే చేపడతాం
RELATED ARTICLES