Thursday, May 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం..

కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలో
మేడే సందర్భంగా గురువారము మండల కేంద్రమైన ముదిగుబ్బలో సిపిఐ పార్టీ నాయకులు ప్రపంచ కార్మికుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సొసైటీ బ్యాంకు సమీపంలో ఏర్పాటుచేసిన పార్టీ స్తూపం వద్ద సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ గావించారు, అనంతరం మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ అన్ని రంగాల్లోని కార్మికులకు అన్నివేళలా అందుబాటులో ఉండి వారి సంక్షేమం కోసం పోరాటం చేస్తోందన్నారు,
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తిప్పయ్య తో పాటు స్థానిక నాయకులు ఆ దెబ్బ, తుమ్మల చిన్నప్ప ,వెంకట్రాముడు , వై రమేష్ ముత్తులూరి మధు, ఈశ్వర్ నాయక్, మంగలి శీన , వెంకటేష్ నాయక్, వెల్డింగ్ భాస్కర్ ,నబీ సాబ్ తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు