Thursday, March 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపొలం బాధితులకు తప్పక న్యాయం చేస్తాం ..ఆర్డీవో మహేష్

పొలం బాధితులకు తప్పక న్యాయం చేస్తాం ..ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ముదిగుబ్బ/ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం దొరిగల్లు పంచాయతీ పరిధిలో గల ఆడవి బ్రాహ్మణపల్లి తండాలో కొంతమంది బాధితులు తమ పొలములను అన్యాయంగా కొంతమంది ఆక్రమణదారులు ఆన్లైన్లో నమోదు చేసి మాకు జీవనాధారం లేకుండా చేశారన్న ఫిర్యాదులు తోపాటు వివిధ దినపత్రికలలో కథాంశాలు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ఇటీవల అడవి బ్రాహ్మణ ఫలితాండాలో బాధితులకు జరిగిన అన్యాయంపై వారు విచారణ చేపట్టారు. తదుపరి ఆర్డీవో విచారణ చేపట్టి న్యాయం చేపట్టాలని తెలపడం జరిగింది. దీంతో బుధవారం ఆర్డిఓ మహేష్ అడవి బ్రాహ్మణపల్లి తండాలో తన విచారణ చేపట్టారు. ఈ విచారణకు ముదిగుబ్బ ఎంఆర్ఓ నారాయణస్వామి విఆర్వో జయరాములు మండల సర్వేయర్ శివకుమార్ నాయక్ కూడా పాల్గొని సర్వే నంబర్లకు సంబంధించిన వాటిని ఆర్డిఓ కి వివరించారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాధితులతో ఆర్డిఓ నేరుగా మాట్లాడారు. బాధితులు కు జరిగిన అన్యాయాన్ని విని తప్పక న్యాయం చేస్తామని చెప్పారు. సర్వేనెంబర్ 18 58-5,7,9,10,11, అదేవిధంగా 1809-2,1962,1963-1,3 సర్వేయర్ పొలములను స్వయంగా ఆర్డిఓ పరిశీలించారు. అటు అధికారులు చెప్పిన విషయాన్ని, బాధితులు చెప్పిన విషయాన్ని వారు పూర్తిగా విన్నారు. అనంతరం రెవెన్యూ రికార్డుల ప్రకారం పై తెలిపిన సర్వే నెంబర్లు యొక్క పూర్తి వివరాలను తెలియజేస్తూ, ఆర్డీవో కార్యాలయానికి నివేదిక పంపాలన్న ఆదేశాలను ఎమ్మార్వో నారాయణస్వామిని ఆదేశించారు. ఎమ్మార్వో ఇచ్చిన నివేదిక ప్రకారం అందరికీ న్యాయం చేకూర్చుతామని ఆడివో తెలిపారు. సర్వే నెంబర్ లో ఉన్నవారు సాగులో ఉన్నారా? లేదా? అలాకాకుండా ఇతరులు ఎవరైనా అడ్డదారిన ఆన్లైన్లో నమోదు చేసుకున్నారా? అన్న వివరాలను కూడా వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేకూర్చితామని ఆర్డీవో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు