ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు
విశాలాంధ్ర -ధర్మవరం : డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ నరసింహులు, డాక్టర్ సోనియా, పుల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల నూతన ఆసుపత్రి భవనములో డయాలసిస్ (రక్త శుద్ధి కేంద్రం) ప్రధమ వార్షికోత్సవమును రోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో జరుపుకున్నారు. అనంతరం వారు డయాలసిస్ తో వైద్య చికిత్సలు అందుతున్న వారిని ప్రేమతో పలకరించి, అక్కడ వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తదుపరి వారికి వైద్యం పట్ల మంచి భరోసా ఇస్తూ మంచి ధైర్యాన్ని నింపారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వారు మాట్లాడుతూ ఈ డయాలసిస్ కేంద్రం 2024డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించబడి, నేటికీ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మీయొక్క బాగోగులను గుర్తించడానికి తాము రావడం జరిగిందని. మీ సమస్యలను విని, ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమారి యాదవ్ దృష్టికి తప్పకుండా తీసుకొని వెళ్లి మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. మొత్తం మీద అక్కడ వైద్యం అందుకుంటున్న రోగులు, వారి సహాయకులు వైద్యం తీరు పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం డయాలసిస్ రోగులకు స్పందన ఆసుపత్రి డాక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు డాక్టర్ సోనియా పండ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా రోగులకు మంచి వైద్య సికిత్సలను అందిస్తూ ప్రతిభగానపరిచిన అందరికీ వారు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ హాస్పిటల్ మేనేజర్ మునీంద్ర ,టెక్నికల్ అసిస్టెంట్ వేణు, గణేష్, స్టాఫ్ నర్స్లు శలీల, సరస్వతి, షాహిదా తదితరులు పాల్గొన్నారు.
డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తాం..
- Advertisement -
RELATED ARTICLES


