విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగు పరుస్తామని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు సంకల్ప-2025 లో భాగంగా కళాశాలలోని విద్యార్థులను వారి యొక్క ప్రతిభ ఆధారంగా ఏ, బి, సి కేటగిరీలుగా గ్రూపులు చేయడం జరిగిందని తెలిపారు. బి గ్రూపు, సీ గ్రూపు లో గల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరిగిందన్నారు. ఈ స్టడీ మెటీరియల్ వల్ల విద్యార్థులు మరింత మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారని వారు తెలిపారు. ఇటువంటి మెటీరియల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనీతర సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగుపరుస్తాం.. ప్రిన్సిపాల్ ప్రశాంతి
RELATED ARTICLES