అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాబునీస
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని శారద నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా విధులు నిర్వర్తిస్తున్న కె పరిమళ గత 11 సంవత్సరాలుగా పదవ తరగతి అర్హతతో ఆయాగా పనిచేస్తుంది. అప్పట్లో అంగన్వాడి టీచర్ పోస్టు లేకపోవడంతో ఆయాగా కొనసాగింది. తదుపరి తాను పదవ తరగతి ఉత్తీర్ణత చెందినందున పదోన్నతి కావాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని తెలిపారు. దీంతో ఆర్డీవో కార్యాలయం వద్ద చంటి బిడ్డతో నిరసన పోరాటం నిర్వహించింది. ఈ పోరాటానికి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాబునిషా మద్దతు పలుకుతూ న్యాయం కోసం పోరాటం కొనసాగించారు
దాదాపు రెండు గంటల పాటు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. తదుపరి సిడిపిఓ లక్ష్మి నిరసన కార్యక్రమం వద్దకు చేరుకోగా జరిగిన విషయాన్ని జిల్లా అధ్యక్షురాలు, ఆయా విషయం తెలిపింది. తాము కోర్టు లో పోరాడి అంగన్వాడీ పోస్టు ఇమ్మన్న ఆర్డర్ కాపీను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని వారు గట్టిగా ప్రశ్నించారు. అనంతరం సిడిపిఓ లక్ష్మీ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత, కచ్చితంగా పరిమిలకు అంగన్వాడి టీచర్ పోస్టులు ఇస్తామని వారు హామీ ఇచ్చారు.
ఆయాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు ఆపము..
RELATED ARTICLES