-తహశీల్దార్ పి.విజయకుమారి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : గ్రామంలో భూములకు వెళ్లే రస్తాల వివాదాలు, భూమి కొలతలకు సంబంధించి ఉన్న సమస్యలను నిర్ణీత సమయంలో ఖచ్చితంగా పరిష్కరిస్తామని తహశీల్దార్ పి. విజయకుమారి తెలిపారు. గురువారం మండలంలోని ఎం. చెర్లోపల్లి గ్రామంలో పసుపుల లక్ష్మీదేవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి ఎక్కువగా రస్తా సమస్యలు వచ్చాయని, సానుకూల దృక్పథంతో వెళ్తే వివాదం పరిష్కారం అవుతుందన్నారు. గ్రామంలోని స్మశాన వాటికలను కొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు దశాబ్దాల కింద కొన్న భూమిని సాగు చేసుకుంటున్నామని ఆన్లైన్లో నమోదు చేయాలని ఒక రైతు కోరారు. ఇంటి స్థలాల మంజూరు, రేషన్ కార్డులకు త్వరలోనే అర్జీలు స్వీకరిస్తామన్నారు. దేవాదాయ శాఖ భూములు సాగు చేస్తున్న రైతులు కౌలు చెల్లించి గుర్తింపు కార్డులు పొందాలన్నారు. కార్యక్రమంలో వీఆర్ఓ సయ్యద్ బాషా, పసుపుల బాబయ్య, డీలర్ రామానాయుడు, నర్సింహులు, పోతన్న, పి.రామకృష్ణ, వై.చండ్రాయుడు, ఎం. వై.చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.