విశాలాంధ్ర-ధర్మవరం ; ఆర్ డి టి సంస్థకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎన్జీవో నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ సత్య నిర్ధారన్ మాట్లాడుతూ ఆర్గనైజేషన్ ఆఫ్ విన్సెంట్ టెర్రర్ మెమోరియల్ హెల్త్ క్యాంపు తులసీదాం వృద్ధుల ఆశ్రమం నందు స్వచ్ఛంద సంస్థల సమావేశమును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఫిజియోథెరపీ గ్రంథాలయం నెలకొల్పడానికి ఎన్జీవోల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఆర్డిటి అందిస్తున్న సేవలు కొనసాగడానికి సౌత్ ఇండియా స్వచ్ఛంద సంస్థల తరఫున సహకారం ఉంటుందని వారు తెలియజేశారు. ఆశ్రమ నిర్వాహకులు సుశీలమ్మ మాట్లాడుతూ త్వరలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ధర్మవరం మెహర్ బాబా వృద్ధుల వైద్య శిబిరం నిర్వాహకురాలు సుజాతమ్మ చీరలను పంపిణీ చేశారు. తదుపరి ఆశ్రమ పరిసరాలను పరిశీలించి మొక్కలు నాటడానికి వారు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహా, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో ఫెర్రర్ పేరుతో ఇటీవల పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ధర్మపురి గ్రామంలో ఆర్డిటి భవంతినందు ఫిజియోథెరపీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. తదుపరి మెమెంటోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జరసమ్ అధ్యక్షులు చాంద్బాషా, పాత్రికేయులు జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డిటి సంస్థకు అండగా ఉంటాం…ఎన్జీవోల మద్దతు
RELATED ARTICLES