గుంతకల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ విల్సన్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మరిన్ని చర్యలు చేపడతామని గుంతకల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ విల్సన్ బాబులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం రైల్వే స్టేషన్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైల్వే నిర్మాణ పనులను ప్లాట్ఫారము, విశ్రాంతి గది, బుకింగ్ కౌంటర్, తదితర వాటిని కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్లాట్ఫారం వద్ద డ్రైనేజ్ నీరు బయటకు వస్తున్నాడంతో ప్రయాణికులు దుర్వాసన భరించలేకపోతున్నారని రైల్వే డివిజన్ కమిటీ సభ్యులు భీమనేని ప్రసాద్ నాయుడు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన అధికారులు ధర్మవరం రైల్వే స్టేషన్ లో అన్ని సమస్యలను తప్పక పరిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు. ధర్మవరం రైల్వే స్టేషన్ ఆధునికరణ కోసం 7.50 కోట్లకు గాను పేస్-1 కింద రూ.3.50 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రైల్వే స్టేషన్ లో జి ఆర్ పి ఆర్ పి ఎఫ్ భవనాలు చాలా పాతవి కావడంతో వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి నిధులు కూడా మంజూరు కావడం జరిగిందని తెలిపారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. రైల్వే ఆసుపత్రి నిర్మించడానికి విశేష కృషి చేస్తున్నామని, విశ్రాంతి గదిలో ,ప్రతి ప్లాట్ఫారం వద్ద గల మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా రైల్వేటేషన్ నుంచి పుట్టపర్తి వెళ్లడానికి మరిన్ని బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గుడ్ సెట్ కొట్టాల వైపు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందట గల కట్టడాలను మొత్తం తొలగించడం జరుగుతుందని 2.5 లక్షల రూపాయలతో కెపాసిటీ ట్యాంకులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యం కేంద్రం అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ చల్లా నరసింహనాయుడు కమర్షియల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, సీనియర్ సెక్షన్ సివిల్ ఇంజనీర్ ఉమేష్ కుమార్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ బాబూజీ రావు, ధర్మవరం స్టేషన్ వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడు కాశీ విశ్వనాథ్, వంకదారి నాగరాజు, కోటి వెంకటేశులు, భీమనేని ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మరింత చర్యలు చేపడతాం..
RELATED ARTICLES