రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
విశాలాంధ్ర ధర్మవరం;; ఖరీఫ్ సాగు కోసం రైతులకు పంపిణీ చేసే వేరుశనగ విత్తన కాయలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చర్చించారు. వేరుశనగ,కంది సబ్సిడీ, సరఫరాలో ఏర్పడే సమస్యలపై అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా కలిసి ఈ సమస్యను వివరించారు. ఈ సమావేశంలో మంత్రివర్యులు సమస్యలపై సమగ్రంగా చర్చించగా, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని తెలియజేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులతో తక్షణమే చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటామని సత్యకుమార్కు హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సత్యకుమార్ సత్యసాయి జిల్లా కలెక్టర్ , డిఏఓ తో కూడా మాట్లాడారు. కలెక్టర్, డిఏఓ కు సంబంధిత అంశాలను వివరించి, సబ్సిడీ పంపిణీలో లోపం లేకుండా త్వరితగతిన రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేరుశనగ కాయల కోసం పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చే రైతుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించాలని , నాణ్యతలో రాజీ లేకుండా నాణ్యమైన విత్తన కాయలను పంపిణీ చేయాలన్నారు. పంపిణీలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు .
రైతులకు సబ్సిడీతో నాణ్యమైన వేరుశనగ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం..
RELATED ARTICLES