Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కృషి చేస్తాం: బిల్ గేట్స్

ఏపీలో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కృషి చేస్తాం: బిల్ గేట్స్

ఏపీ ప్ర‌భుత్వంతో ఒప్పందాల‌పై బిల్ గేట్స్ హ‌ర్షం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కూట‌మి ప్ర‌భుత్వంతో ఒప్పందాల‌పై మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు. ఏపీలో ఆరోగ్యం, విద్యా, వ్య‌వ‌సాయ రంగాల్లో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కృషి చేస్తామ‌న్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మెరుగైన సేవ‌లు అందించాల‌ని ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, బుధ‌వారం నాడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిల్ గేట్స్ తో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గేట్స్ ఫౌండేష‌న్‌తో రాష్ట్రానికి సంబంధించి ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు