Wednesday, April 2, 2025
Homeజిల్లాలుకర్నూలుప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి?

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి?

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఏమిటని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ లు ప్రశ్నించారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో సిపిఐ పార్టీ వివిధ సమస్యలపై పోరాటాలు చేస్తుందన్నారు. ప్రజల పక్షం నిలబడి సమస్యలపై అధికారులను నిలదీస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పొజిషన్ పట్టాలో ఉన్న 4 సెంట్లు స్థలాన్ని రద్దు చేసి 1.5 సెంట్లు మంజూరు చేసిందన్నారు. ఆ స్థలానికి హద్దులను చూపమని రెవెన్యూ అధికారులకు నాలుగు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన తిక్కమ్మ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని కోరామని, తహసీల్దార్ గీతా ప్రియదర్శిని బాధితులను, సిపిఐ నాయకులను ఇది పెద్ద సమస్య కాదని, పొజిషన్ సర్టిఫికెట్ అని ఆఫీసు నుంచి బయటకు వెళ్లమని దుర్భాషలాడుతూ మహిళను తన సిబ్బందితో నెట్టివేసిందన్నారు. దీంతో ఈ విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అనడంతో పోలీసు స్టేషన్ లో సిపిఐ నాయకులు వీరేష్ పై కేసు పెట్టారని తెలిపారు. ప్రజా వేదికలో వచ్చిన అర్జీలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న తహసీల్దార్ గీతా ప్రియదర్శినిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, నర్సింహులు, తిక్కమ్మ, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు