Homeఆంధ్రప్రదేశ్ఎదురుపడితే నమస్కారంతోనే పలకరింపు

ఎదురుపడితే నమస్కారంతోనే పలకరింపు

- Advertisement -

తన పుస్తకంలో మోదీపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు!
మోదీతో వ్యక్తిగత పరిచయం లేదన్న సోనియా
గతంలో నేతల మధ్య స్నేహపూర్వక సంబంధాలుండేవని వ్యాఖ్య


ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు నమస్కారం చేసుకోవడం మినహా ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ ఉండదని తెలిపారు. మోదీ తనను కలిసినప్పుడు కళ్లలోకి చూడకుండా మరోవైపు చూస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాలను తన తాజా పుస్తకం ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో వివరించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పన్నెండేళ్లకు పైగా గడిచిందని, ప్రస్తుతం ఆయన మూడోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనతో తనకు ఇప్పటివరకు నిజమైన వ్యక్తిగత పరిచయం ఏర్పడలేదని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో వివిధ పార్టీల నేతలు సమావేశమవుతుంటారని ఆమె వివరించారు. అలాంటి సందర్భాల్లో మోదీ ఎదురుపడితే ఇద్దరం మర్యాదపూర్వకంగా నమస్కారం చేసుకుంటామని చెప్పారు. గతంలో భిన్న రాజకీయ పార్టీలకు చెందిన నేతల మధ్య కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని, ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఆ అధికారిక పలకరింపులు మినహా మోదీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదని సోనియా తెలిపారు. అయితే పుట్టినరోజులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మాత్రం పరస్పరం తెలియజేసుకున్నామని చెప్పారు. దేశం పట్ల మోదీ ఆలోచనలు, తన భావాలు పూర్తిగా భిన్నమైన రాజకీయ దృక్పథాలకు చెందినవని పేర్కొన్నారు.

తాను ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తిరిగి వచ్చిన సందర్భాల్లో మోదీ ఆరోగ్యం గురించి అడిగేవారని సోనియా వెల్లడించారు.‘బాగున్నారా?’ అని ఆయన ప్రశ్నిస్తే, ‘బాగున్నాను.. ధన్యవాదాలు’  అని సమాధానం చెప్పేదానినని పుస్తకంలో రాశారు. సోనియా గాంధీ రాసిన ఈ పుస్తకం నేటి నుంచి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు