కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డిమాండ్
విశాలాంధ్ర -ధర్మవరం : విశాలాంధ్ర ధర్మవరం; మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వైస్సార్ కాలనీ లో నెలకొన్న సమస్యలపై శనివారం వార్డు పర్యటన చేసి స్థానిక ప్రజలను సిపిఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆలకుంట మారుతీ, సీనియర్ నాయకులు ఎస్ ఎచ్ బాషా, టీ,అయూబ్ ఖాన్, గుంపుహరి, మాట్లాడుతూ, ఈ కాలనీ ఏర్పడి ఇరవై సంవత్సరాలైన ఇంతవరకు ప్రజలకు కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు సంపూర్ణ దిశలో లేకపోవడం దారుణమన్నారు.పదిరోజులకి ఒక సారి కూడారాని త్రాగునీరు, అయినా మున్సిపాలిటీ అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులకు గాని, పట్టించుకోకపోవడం గమనార్హం అని తెలిపారు. ఇక్కడి ప్రజలు తమ ఆవేదనను తెలిపిన కూడా పరిష్కారం కాకపోవడం ఎంతవరకు సమంజసమని వారు అధికారులను ప్రశ్నించారు. ఏ పనికి అయినా నీరు ప్రధాన అవసరం అని, అటువంటిది నీరు సక్రమంగా సరఫరా చేయక పోతే, కాలనీవాసులు ఎక్కడకెళ్ళి తెచ్చుకోవాలని ప్రజా ప్రతినిధులను మున్సిపల్ అధికారులను వారు ప్రశ్నించారు.మున్సిపల్ కమీషనర్ ఈకాలనీలో సమస్యలపై తక్షణమే ఇక్కడ పర్యటించి వీరికి ఒక పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు.ఇక రోడ్లు అయితే ఎక్కడ వేయలేదని, అందువలన గుంతలుపడి అస్తవ్యస్తంగా మారిపోవడంతో రాత్రిపూట ఈ కాలనీ లోపలికి ఆటోవాళ్ళు రావాలన్న, ద్విచక్ర వాహనాల్లో రావాలన్నా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు మండిపడ్డారు.అందులోను కాలనీ మొత్తానికి ఒక్కటే డ్రైనేజీ ఉండడం వల్ల ఇళ్ల ముందే మురుగు నీరు నిల్వ ఉండి పోయిందన్నారు, ఇలా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల, రోగాలు ప్రబలి ఇక్కడి పిల్లలు వృద్దులు అందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగాల్సిపరిస్థితి దాపురించడం జరిగిందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాములు, విషపురుగులు అదికంగా ఉంటాయని, ఇటువంటి చోట రాత్రి వేళల్లో బయటకి రావాలంటేనే బయపడి జీవనం సాగిస్తున్నారని, అందువలన తక్షణమే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ వైస్సార్ కాలనీ లో నెలకొన్న సమస్యలని పరిష్కరించాలని, లేని పక్షంలో సి పి ఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
సిపిఎం పార్టీ నాయకులు ఖాదర్ బాషా, హైధర్ వలి, వెంకటస్వామి, మహబూబ్ పీరా తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు కనీసఅవసరాలు కూడా తీర్చలేని (కల్పించని)ప్రభుత్వాలు ఎందుకు..?
RELATED ARTICLES