విశాలాంధ్ర ధర్మవరం;; భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్డిఎస్) రాష్ట్ర కన్వీనర్ డక్క కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని శ్రీనివాస జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీలో విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సత్య సాయి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా సంతోష్, కార్యదర్శిగా సాయినాథ్ రెడ్డి, కోశాధికారిగా చరణ్, ఉపాధ్యక్షులుగా అశోక్, సహాయ కార్యదర్శిగా గంగాధర్ తో పాటు 8 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర కన్వీనర్ డక్కా కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పైన అలుపెరుగని పోరాటాలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం పేద పొడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందని ద్రాక్ష పండులా చేస్తూందని వారు మండిపడ్డారు. విద్యార్థులను బానిసలుగా మార్చి వేయడం కోసమే కేవలం కొన్ని ధనిక వర్గాల కోసమే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. దేశంలోని విద్యార్థులకు అతి పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందని, వెంటనే విద్యార్థులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేంతవరకు ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగులో ఉన్న ఫీజు రియబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, తక్షణమే విడుదల చేస్తూ జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తాం.. ఏఐఎఫ్డిఎస్
RELATED ARTICLES