Homeజాతీయంపోలీసు బస్సు తాళాలు లాక్కెళ్లిన మహిళ.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత!

పోలీసు బస్సు తాళాలు లాక్కెళ్లిన మహిళ.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత!

- Advertisement -

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
మహిళ చర్యపై మిశ్రమ స్పందనలు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న ఓ మహిళా కార్యకర్త చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు బస్సు తాళం చెవిని ఆమె లాక్కొని, వాహనం కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓటర్ల జాబితా (ఎలక్టోరల్ రోల్) సవరణలు, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన పలు డిమాండ్లతో ఢిల్లీలో కొందరు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించి, పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సులో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధమవుతుండగా, ఓ మహిళ ఒక్కసారిగా డ్రైవర్ వద్దకు వెళ్లి తాళం చెవిని లాక్కున్నారు.ఆ వెంటనే ఆమె జనం మధ్యలోకి వెళ్ళిపోవడంతో బస్సు ముందుకు కదలలేదు. తాళం చెవి కోసం కొందరు ఆమెను వెంబడించినా ఫలితం లేకపోయింది. ఈ అనూహ్య పరిణామం అంతా కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె తెగువను కొందరు ప్రశంసిస్తుండగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు