Friday, May 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివినియోగదారుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి..

వినియోగదారుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి..

వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు సురేష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; వినియోగదారుల సమస్యలను పరిష్కరించే దిశలో అందరూ కృషి చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు సురేష్ కుమార్, కార్యదర్శి కాకుమాని రవీంద్ర, ధర్మవరం అధ్యక్షులు పళ్లెం జనార్దన్ తెలిపారు. ఈ సందర్భంగా కన్జ్యూమర్స్ కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లాలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి చర్చించారు. అన్ని మండలాల్లో వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేస్తూ, సంబంధిత సమస్యల అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లాలని తీర్మానం చేశారు. వినియోగదారులు ఏదేని వస్తువు కొనుగోలులో అన్యాయం జరిగితే వారికి అవగాహన కల్పించి న్యాయం చేయాలని తెలిపారు. వినియోగదారుల సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు