Saturday, December 21, 2024
Homeఆంధ్రప్రదేశ్రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం

రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం

ఏపీకి ప్రపంచ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణానికి 800 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధానికి ఇప్పటికే ఏడీబీ 788 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌‌లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని వెల్లడించింది. ఈ రెండు సంస్థల ద్వారా 1588 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సిఫార్సుతో రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు