ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని ఆర్డిఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాల మైదానంలో జూన్ 21 రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవం సందర్భంగా వారు నెల రోజులపాటు నిర్వహించే యోగ శిక్షణా తరగతులను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ 21 యోగా దినోత్సవం గా పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలిపిందన్నారు. ఇందులో భాగంగా గ్రామ గ్రామాన నెల రోజులు ముందుగా యోగా శిక్షణ తరగతులను ప్రారంభించాలని తెలిపారు. యోగా వల్ల చక్కటి ఆరోగ్యము, శరీర దృఢత్వం లభిస్తుందన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి లో దూరమవుతాయన్నారు. కావున ప్రజలందరూ కూడా యోగా శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి మనోహర్, ధర్మవరం యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, కట్టా రవికుమార్, సాకే ఈశ్వరయ్య, కోనాపురం సాయి ప్రసాద్, పలువురు అధికారులు, యోగ శిక్షార్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది..
RELATED ARTICLES