ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; యోగ నేరవడం వలన చక్కటి ఆరోగ్యం తో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఏడున్నర గంటల వరకు యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిక్షణలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రజలు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటికే యోగా శిక్షణా తరగతులకు చక్కటి అనూహ్య స్పందన రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఉరుకులు పరుగులతో నేడు ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రవేటు ఉద్యోగులు కేవలం ఉద్యోగ వృత్తికే పరిమితం కావడం వల్ల శరీరం అనుకూలించకపోవడం అనారోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుందని, ఇటువంటి దానికి యోగ ఒక్కటే పరిష్కారం అని తెలిపారు. యోగ అంటే ఆసనాలు మాత్రమే కాదని, శరీరానికి ఉల్లాసము ,ఉత్సాహము, శరీర దృఢత్వం ఇస్తుందని తెలిపారు. యోగా అంటే అన్ని శక్తుల కలయిక అని యోగా యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరుగుతోందని తెలిపారు. యోగ వల్ల శరీరంలోని వివిధ శరీర భాగాలకు ఉత్పత్తి జరిగిన శక్తి ప్రవేశించాలని ఆసనాల ద్వారా వాటిని చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ధ్యానం ద్వారా ఏర్పడిన శక్తి శరీరమంతా ప్రవేశిస్తుందని, అదే యోగ యొక్క ప్రత్యేకత అని తెలిపారు. అంతేకాకుండా నేటి సమాజంలో షుగర్, బిపి, శరీరంలో నొప్పులు ఉన్న వారు ఎక్కువగా ఉన్నారని వీటికి కూడా యోగా ఒక్కటే చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. నేడు భారతదేశంలోనే కాక వివిధ దేశాలలో యోగా తరగతులు, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల ద్వారా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కావున ఇటువంటి యోగా శిక్షణా తరగతులు ప్రజలకు ఎంతో ముఖ్యము అని, ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆస్వాదించాలని తెలిపారు. కావున పట్టణ , మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ యోగా శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
యోగ వల్ల చక్కటి ఆరోగ్యం.. మనశ్శాంతి
RELATED ARTICLES