Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబు నాథ్ (35 సంవత్సరాలు) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని మనస్థాపం చెంది తన ఇంటిలోనే ఎవరూ లేని సమయంలో గవాచికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు టైల్స్ వర్క్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు