Wednesday, February 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రేమికుల దినోత్సవం నాడు యువ‌కుడి ఘాతుకం.. యువ‌తిపై యాసిడ్ దాడి

ప్రేమికుల దినోత్సవం నాడు యువ‌కుడి ఘాతుకం.. యువ‌తిపై యాసిడ్ దాడి

ప్రేమికుల దినోత్సవం రోజున ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది‌. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు‌. అన్నమయ్య గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు. గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గౌతమికి ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి నిశ్చయం అయింది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నేడు గణేష్ ప్యారంపల్లికి చేరుకుని గౌతమిని ప్రేమించమంటూ వెంటపడ్డాడు.. అమె నిరాక‌రించ‌డంతో ముందుగా గౌతమి తలపై కత్తితో దాడి చేశాడు.. ఆ తర్వాత మొహంపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు