ఏఐవైఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి సకల రాజా
విశాలాంధ్ర ధర్మవరం : సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా ఆధ్వర్యంలో ఎన్జీవో హోం లో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో యువకులను సమీకరించి ,స్వాతంత్ర ఉద్యమంలో వీరోచితమైన పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల ఆశయాలను ఈనాటి యువత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ధర్మవరం పట్టణ కార్యదర్శి సునీల్.గోవర్ధన్. భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలి
RELATED ARTICLES