Homeజిల్లాలుకర్నూలువెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులో వారు విలేకరులతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మద్యపాన నిషేధం అంటూ కల్తీ మద్యంతో వెన్నుపోటు, పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేసి నిరుపేదలకు వెన్నుపోటు, అమ్మ ఒడి అని చెప్పి ఒకరికి మాత్రమే ఇచ్చి విద్యార్థులకు వెన్నుపోటు, జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో రైతులకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. కేవలం ఉనికిని చాటుకోవడానికి వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉందన్నారు. చెప్పిన మాట ప్రకారం పింఛన్లు పెంపు, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అందించడం, మూతపడ్డ అన్నా క్యాంటీన్లు తెరిపించడం, మెగా డిఎస్సీ ద్వారా 16432 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వంటివి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు ఏది వెన్నుపోటో, ఏది సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు